వంద మాటల్లో చెప్పలేని భావాన్ని ఒక్క బొమ్మతో చెప్పొచ్చంటారు. దానికి సరిగ్గా సరిపోయే బొమ్మ ఇది. "పై" అనే సంఖ్యకు 3.1415... అనే విలువ ఎలా వచ్చిందని అడిగితే, అది వృత్తం యొక్క వ్యాసానికి దాని చుట్టుకొలతకు మధ్యన ఉన్న నిష్పత్తి అని చెప్పొచ్చు. అలా కాకుండా కింద ఉన్న బొమ్మను చూపిస్తే ఎవరైనా సరే "పై" అంటే ఏమిటో చిటికెలో అర్ధం చేసుకుంటారు. అర్థం చేసుకోవడమే కాదు, దానిని ఇంక జీవితంలో మర్చిపోరు.
వికీమీడియా కామన్సులో ఇటువంటి బొమ్మలు వేలకొలదీ ఉన్నాయి. చూడంగానే చూస్తూ ఉండిపోవాలనిపించే బొమ్మలు కూడా ఇక్కడ వేలలోనే ఉన్నాయి. క్రితం సంవత్సరం అప్లోడుచేసిన బొమ్మలలో
అత్యుత్తమ బొమ్మలుగా ఎన్నుకున్న బొమ్మలను కూడా ఒకసారి చూడండి.
4 వ్యాఖ్యానాలు: